హైద‌రాబాద్ : సెలైన్ లో విషం ఎక్కించుకుని డాక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌..!

-

హైద‌రాబాద్ లో ఓ యువ డాక్ట‌ర్ సెలైన్ లో విషం ఎక్కించుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. వివ‌రాల్లోకి వెళితే..హైద‌రాబాద్ అమీర్ పేట్ లోని శ్యామ్ క‌ర‌ణ్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో ప‌నిచేస్తున్న డాక్ట‌ర్ రాజ్ కుమార్ జీకే గూడ‌లో అద్దెకు ఉంటున్నాడు. కాగా గ‌త రాత్రి రాజ్ కుమార్ త‌న మ‌న‌సు భాగోలేదుని మిత్రుడికి ఫోన్ చేసాడు. ఆ త‌ర‌వాత కొద్ది సేప‌టికి స్నేహితుడికి అనుమానం రావ‌డంతో రాజ్ కుమార్ ప‌లుమార్లు ఫోన్ చేసాడు. కానీ రాజ్ కుమార్ ఎంత‌కీ లేప‌క‌పోవ‌డంతో రాజ్ కుమార్ తో ప‌నిచేసే మ‌రోవైద్యుడు శ్రీకాంత్ కు ఫోన్ చేసి విష‌యం చెప్పాడు.

దాంతో శ్రీకాంత్ రాజ్ కుమార్ అద్దెకు ఉంటున్న ఫ్లాట్ వ‌ద్ద‌కు వెళ్లాడు. డోర్ ఎంత‌కీ తీయ‌క‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చి కిటికీలో నుండి చూడ‌గా లోప‌ల సెలైన్ పెట్టుకుని రాజ్ కుమార్ అప‌స్మార‌క స్థితిలో క‌నిపించాడు. డోరు బ‌ద్ద‌లు కొట్టి వెంట‌నే రాజ్ కుమార్ ను ఆస్ప‌త్రికి త‌ర‌లించగా అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్టు వైద్యులు నిర్ధారించారు. రాజ్ కుమార్ క‌డ‌ప జిల్లా బ‌ద్దేలు వాసి కాగా ఆయ‌న తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version