హీరో బాలయ్య సంచలన నిర్ణయం.. రేపు హిందూపురం లో మౌనదీక్ష

-

గత వారం రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పై కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి సర్కార్… సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ప్రభుత్వం. అయితే జిల్లాల పునర్విభజన పై చాలా చోట్ల వ్యతిరేకత వస్తోంది.

బాలయ్య నియోజకవర్గమైన హిందూపురాన్ని జిల్లా చేయాలంటూ.. మొదటి నుంచి డిమాండ్ వినిపిస్తోంది.ఈ నేపథ్యంలోనే ఇవాళ హిందూపురంకు చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ… సంచలన నిర్ణయం తీసుకున్నారు.

జిల్లా సాధన కోసం రేపు పట్టణంలో మౌన ప్రదర్శన ర్యాలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ర్యాలీలో స్వయంగా తానే పాల్గొనాలని ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్ణయం తీసుకున్నారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీని కొనసాగించాలని పేర్కొన్నారు బాలయ్య. ర్యాలీ అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద మౌన దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం అఖిలపక్షాల సమావేశంలో పాల్గొననున్నారు బాలయ్య.

Read more RELATED
Recommended to you

Exit mobile version