పవన్ ని మూడు పెళ్లిళ్ల గురించి అడిగిన బాలయ్య.. నోరు విప్పారా..?

-

తాజాగా టాలీవుడ్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాపబుల్.. మొదటి సీజన్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు రెండవ సీజన్ కూడా మొదలు పెట్టేసింది. ఇప్పటికే ఎంతోమంది రాజకీయ నాయకులు, స్టార్ డైరెక్టర్లు, యంగ్ హీరోలు కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ షో కి హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న అన్ స్టాపబుల్ షో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు.

ఇందులో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎపిసోడ్ మొదటి భాగాన్ని ఫిబ్రవరి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వెల్లడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన మొదటి పార్ట్ ప్రోమోను కూడా విడుదల చేయగా ఆ ప్రోమోలో పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీ తో ఎపిసోడ్ ప్రారంభించారు.. వెంటనే బాలకృష్ణ పవన్ ను ఉద్దేశించి ఈశ్వరా పవనేశ్వర అంటూ జపించారు. అప్పుడు వెంటనే పవన్ ..నేను మీకు తెలుసు .. నా స్థానం మీ మనసు.. అంటూ డైలాగ్ చెప్పడంతో బాలకృష్ణ అరిచేసారు.

ముఖ్యంగా త్రివిక్రమ్ తో స్నేహం , రామ్ చరణ్ తో సానిహిత్యం అన్నింటికీ సమాధానం చెప్పిన పవన్ కళ్యాణ్ తో బాలయ్య మూడు పెళ్లిళ్ల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు.. డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ను పెళ్లిళ్ల గురించి అడుగుతూ.. ఈ పెళ్లిళ్ళ గొడవేంటి భయ్యా అంటూ బాలకృష్ణ పవన్ ని ప్రశ్నించగా.. వాళ్ళు బాధపడతారేమో అని అంటూనే విజ్ఞతా, సంస్కారం తో మాట్లాడకుండా ఆపేస్తున్నాను అంటూ తెలిపారు పవన్. మొత్తానికి అయితే ఈ ప్రోమోలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన మాత్రం బాగా హైలైట్ అవుతోంది. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అని విమర్శించే వాళ్లకు ఈ ఎపిసోడ్ తో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version