జగన్ కు మెగా బైట్స్, గిగా బైట్స్ అంటే తెలీదంటూ బాలయ్య ర్యాంగింగ్ చేశాడు. వైఎస్సార్సీపీ ఓటమి అంచుల్లో కొట్టుమిట్టాడుతోందని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తన పార్టీ, తాను ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని సీఎం జగన్కు కూడా తెలుసని అన్నారు. వైస్సార్సీపీ పాలనలో ఏపీ సర్వనాశనమైందని విమర్శించారు.
అభివృద్ధి శూన్యం, దోపిడీ ఘనం అన్నట్లుగా పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. యువతకు టీడీపీ లో జరిగింది ఏంటి… ఇప్పుడు జరుగుతున్నది ఏంటి…!పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్కు మెగా బైట్స్, గిగా బైట్స్ అంటే ఏంటో తెలుసా…? అంటూ చురకలు అంటించారు.రాష్ట్రంలో ఏం జరుగుతుందో…లోకేష్ రాష్ట్ర పరిస్థితులను వివరిస్తున్నారు.. రాబోయే ఎన్నికల్లో ప్రజలు జాగ్రత్త పడాలన్నారు. ఏపీలో అసమర్ధ పాలన… చెత్త పరిపాలన నడుస్తోంది.. రాజధాని లేని రాష్ట్రం… పోలవరం ఊసేలేదని ఫైర్ అయ్యారు బాలయ్య.