దేశంలో బై బై మోదీ అని ట్రెండింగ్ అవుతుంది: బాల్క సుమన్

-

బిజెపి సర్కారుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైంది అని అన్నారు. సొంత రాష్ట్రంలో ఏం చేయలేని తరుణ్ చుగ్ తెలంగాణకు వచ్చి ఏదో చేస్తానంటున్నాడు అని మండిపడ్దారు.బండి సంజయ్ సొంత పార్లమెంటు నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నయాపైసా తీసుకురాలేదు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పై మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.

బిజెపి పార్టీ ఆఫీసు ముందు పెట్టిన బోర్డును తక్షణమే తీసివేయాలని హెచ్చరించారు. ఒకవేళ ఆ బోర్డును తొలగించకుంటే బై బై మోడీ అని డిజిటల్ బోర్డు పెట్టి దానికి చెప్పుల దండ వేస్తానని హెచ్చరించారు. బిజెపి పార్టీకి కూడా కౌంట్డౌన్ స్టార్ట్ అయిందని అన్నారు. దేశంలో రెండు కోట్ల ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసగించారని ఆయన విమర్శించారు. మోదీకి హటావో.. భారత్ కు బచావో అనే నినాదం మొదలైందని చెప్పారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతారా? పాలమూరుకు జాతీయహోదా ఇస్తారా? బీజేపీ కార్యవర్గ భేటీలో దీనిపై సూటిగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version