గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పవన్ కళ్యాణ్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆరెస్ పార్టీ ప్రశాంతంగా ఉంటే..ప్రతిపక్షం సొంత పార్టీ నేతల విమర్శలతో గందరగోళం ఉందని అన్నారు. టీఆర్ఎస్ ప్రకటించిన టికెట్లలో 50 శాతంకి పైగా డిగ్రీ పూర్తి చేసిన వారు ఉన్నారని ఆయన అన్నారు. ప్రతిపక్షాల మాటలు ప్రజలకు కామెడీ షో లా అనిపిస్తున్నాయన్న ఆయన అసలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ లో రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట గెలువలేదని అలా పక్క రాష్ట్రంలో దేనికి పనికి రాని వ్యక్తితో హైదరాబాద్ లో రాజకీయాలు ఎంటో బీజేపీ వాళ్ళకే తెలియాలని అన్నారు.
అన్ని పథకాలు మావే అన్న కేంద్రం…30 ఏండ్ల లోపు కేంద్ర ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండని డిమాండ్ చేశారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ..ఆ హోదా లో హుందాగా ఉండాలని, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తర్ ప్రదేశ్- గుజరాథ్ లో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని అన్నారు. ప్రతిపక్షాలు టీఆర్ఎస్ నేతల పై వ్యక్తిగత విమర్శలు మానుకొని దమ్ముంటే అభివృద్ధి పై మాట్లాడాలని అన్నారు.