253 పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం !

-

253 పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. మొత్తం 7 రాష్ట్రాలలో 253 రాజకీయ పార్టీ లు నిష్క్రియాపరంగా ఉన్నాయని గుర్తించిన “కేంద్ర ఎన్నికల సంఘం”…వీటిలో మొత్తం 86 రాజకీయ పార్టీల ఉనికి, మనుగడే లేదని ప్రకటన లో పేర్కొంది. 253 రాజకీయ పార్టీలలో 66 పార్టీ లు ఒకే ఎన్నికల గుర్తు కావాలని కోరి, ఏ ఎన్నికల్లోనూ ఒక్క అభ్యర్థి కూడా పోటీ చేయలేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది.

తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ,ఉత్తర్ ప్రదేశ్ లకు చెందిన ఈ రాజకీయ పార్టీ లపై నిషేధం విధించింది. ఈ రాష్ట్రాలకు చెందిన ఎన్నికల అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు చర్యలు తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం….1968 లో జారీ చేసిన “ఎన్నికల గుర్తు” ఆర్డర్ వల్ల పొందే ప్రయోజనాలు పొందకుండా ఈ పార్టీలను నిషేధించింది. ఇప్పటివరకు “కేంద్ర ఎన్నికల సంఘం” వద్ద “నమోదై గుర్తింపు పొందని మొత్తం 537 రాజకీయ పార్టీ లు” కు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం…ఈ ఏడాది మే నెల 25 నుంచి తప్పనిసరిగా, నియమనిబంధనలకు అనుగుణంగా ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వలేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది.

 

2015 నుంచి 16 అంశాలకు సంబంధించిన సమాచారం ఈ రాజకీయ పార్టీ లు సమకూర్చలేదని “కేంద్ర ఎన్నికల సంఘం” ప్రకటన చేసింది. 1951 లో చేసిన “ప్రజా ప్రాతినిధ్యం చట్టం” లోని సెక్షన్ 29 ఏ కింద, రాజకీయ పార్టీ ప్రధాన కార్యలయం చిరునామా, కార్యనిర్వాహక వర్గం, మారిన చిరునామా లాంటి సమాచారాన్ని ఈ రాజకీయ పార్టీలు సమర్పించలేదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version