ఉద్యోగాల భర్తీ చేయకపోతే..ప్రగతి భవన్ ముట్టిడిస్తాం..బండి సంజయ్ హెచ్చరించారు. గ్రూప్ సర్వీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని… ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1600 గ్రూప్-1 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 10 ఏండ్లుగా గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం దారుణమని.. గ్రూప్-1 పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఐఏఎస్ ఆఫీసర్ పోస్టులకు తీవ్ర కొరత ఉందని నిప్పులు చెరిగారు.
ఒక్కో ఐఏఎస్ అధికారి 3, 4 పోస్టులకు ఇంఛార్జ్ గా కొనసాగుతున్నారని.. రాష్ట్రంలో 4 వేల గ్రూప్ -2 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 2 వేల గ్రూప్ -3 పోస్టులు, 40 వేల గ్రూప్ -4 పోస్టులు ఖాళీ ఉన్నాయని.. వేలాది గ్రూప్ పోస్టుల ఖాళీగా ఉండటంతో నత్తనడకన పాలన సాగుతుందని ఫైర్ అయ్యారు. పేదలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అందకుండా పోతున్నాయని.. జిల్లా, డివిజన్, మండల స్థాయి ఆఫీసుల్లో 25 ఏళ్లుగా భర్తీ చేయని జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయని మండిపడ్డారు. తక్షణమే పోస్టులు భర్తీ చేయకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని.. బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.