బండి కార్నర్..’కూల్చివేత’ రచ్చ..రేసులోకి కమలం.!

-

తెలంగాణలో కూల్చివేత వ్యాఖ్యలపై రగడ నడుస్తోంది. అనూహ్యంగా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..పేదలకు పనికిరాని ప్రగతి భవన్‌ని నక్సలైట్లు కూల్చివేసిన ఇబ్బంది లేదన్నట్లు మాట్లాడారు. ఇక దీనిపై అధికార బి‌ఆర్‌ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఫైర్ అవుతూ వచ్చారు. రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టారు..ఆయన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇలా బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది.

దీంతో ఇంతకాలం పోలిటికల్ రేసులో వెనుకబడ్డ కాంగ్రెస్ ఒక్కసారిగా రేసులోకి వచ్చింది. మరి రేవంత్ దూకుడు వల్ల బి‌జే‌పికి ఇబ్బంది ఏమన్నా అవుతుందని అనుకున్నారో లేక మీడియాలో బి‌జే‌పి సైతం కనబడాలని అనుకున్నారో తెలియదు గాని..అనూహ్యంగా బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..సచివాలయం డోములు కూల్చివేస్తామని అన్నారు.

తాజాగా బి‌జే‌పి కార్నర్ మీటింగులు మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కూకట్‌పల్లిలో బండి సంజయ్ ఓ కార్నర్ మీటింగ్ లో పాల్గొని..తాజ్‌మహల్‌ని పోలి ఉన్న తెలంగాణ కొత్త సచివాలయం డోములని తాము అధికారంలోకి రాగానే కూల్చివేస్తామని చెప్పుకొచ్చారు.  తాజ్ మహల్ తరహాలో ఉన్న ఆ డోములు తెలంగాణ సంస్కృతికి భిన్నంగా ఉన్నాయని వాటిని కూల్చి, తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా మళ్లీ మార్పులు చేర్పులు చేస్తామని చెప్పుకొచ్చారు.

తాజ్ మహల్ కంటే అద్భుతంగా సచివాలయాన్ని కేసీఆర్ నిర్మించారని అసదుద్దీన్ ఓవైసీ అంటున్నాడని, అసదుద్దీన్ కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే కే‌సి‌ఆర్ తాజ్ మహల్ నమూనాలో కొత్త సచివాలయాన్ని నిర్మించారని ఫైర్ అయ్యారు. ఇక బండి కూడా కూల్చివేత అంటూ మాట్లాడటంతో..ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై పంచాయితీ నడుస్తోంది. మొత్తానికి తెలంగాణలో కూల్చివేతల రాజకీయం నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version