కొండా విశ్వేశ్వర్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ ను స్వీకరించిన బండి సంజయ్

-

కొండా విశ్వేశ్వర్ రెడ్డి నాకు వైట్ ఛాలెంజ్ చేశాడంట… ఆయన విసిరిన వైట్ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానని బండి సంజయ్ సపస్తం చేశారు. తనకు ఎలాంటి అలవాట్లు లేవని.. అక్టోబర్ 2తో పాదయాత్ర పూర్తి అవుతుంది… ఆ తర్వాత ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని స్పష్టం చేశారు బండి సంజయ్. ఇవాళ తాడ్వాయి లో జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.

ప్రజా సమస్యల పై ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు పెడ్తామంటున్నారని.. దమ్ముంటే నా మీద రాజద్రోహం కేసు పెట్టాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. మక్కలు, వడ్లు కొనకపోతే కొనేటట్లు బీజేపీ.. కెసిఆర్ మెడలు వంచుతదని.. పోడు భూముల మీద కొట్లాడితే మా మీద కేసులు పెట్టారని మండిపడ్డారు. అయినా పోడు భూముల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఈ వైట్ ఛాలెంజ్ తో పేద ప్రజలకు ఎం సంభందం? బాగా బలిసినోడు బలుపు ఎక్కినోడు డ్రగ్స్ తీసుకుంటారని పేర్కొన్నారు. వైట్, బ్లాక్, పింక్, గ్రీన్, ఆరంజ్.. ఏ ఛాలెంజ్ కి అయినా వెనక్కి పోనని స్పష్టం చేశారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version