సీఎం కేసీఆర్ నిన్నటి ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలపై టీ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ ఫైరయ్యారు. కేసీఆర్ ధర్నా చేసింది తెలంగాణ రైతుల కోసమా.. పంజాబ్ రైతుల కోసమా అని ప్రశ్నించారు. పంజాబ్ రైతులకు రూ. 3 లక్షలు ఇస్తామంటున్నారు… మరి తెలంగాణ రైతుల సంగతేంటని బండి సంజయ్ కేసీఆర్ ను ప్రశ్నించారు. ఇక్కడ చనిపోయిన రైతులకు పరిహారం ఇవ్వవా..? నీ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు.
ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని అయన అన్నారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 2019లో 419 మంది, 2020లో 471 మంది రైతులు మరణించారని..వీరందరికి రూ. 25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 14 వందల మంది ఆత్మబలిదానం చేసుకుంటే కానీ తెలంగాణ రాలేదని… అలాంటి అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని బండి సంజయ్ విమర్శించారు.