కేటీఆర్ గేమ్ ఛేంజర్.. కేసీఆర్ నేమ్ ఛేంజర్.. కానీ ప్రజలు ఫేట్ ఛేంజర్ : బండి సంజయ్

-

కేసీఆర్ జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితిపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు బీఆర్ఎస్ పై వ్యంగాస్త్రాలు ఎక్కుపెట్టారు. టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్ గా మార్చడంపై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కేసీఆర్ జాతీయ పార్టీపై సెటైర్లు వేశారు.

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చటం పందికి లిప్‌స్టిక్ పెట్టినట్టుందంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ను ట్విటర్ టిల్లూగా సంభోదించిన బండి సంజయ్.. గేమ్ ఛేంజర్‌గా కేటీఆర్ పేరు పొందితే.. తండ్రి కేసీఆర్ మాత్రం నేమ్ ఛేంజర్ అయ్యారని సెటైర్ వేశారు. అంతిమంగా మాత్రం ప్రజలే ఫేట్ ఛేంజర్స్ అవుతారని బండి సంజయ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా విమర్శలు చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు నూకలు చెల్లాయని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ పేరుతో కేసీఆర్‌ మరో కొత్త డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో రాజకీయాలు చేయడమే బీఆర్ఎస్ సిద్ధాంతమా? అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version