మరమనిషి అంటేనే సస్పెండ్ చేస్తారా..త్వరలోనే కేసీఆర్ కూడా సస్పెండే -బండి సంజయ్

-

ఈటల రాజేందర్ ను సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని… ఇచ్చిన హామీలను నెరవేర్చని వాళ్ళనే మరమనిషి అంటారన్నారు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మరమనిషి అంటేనే సస్పెండ్ చేస్తారా..త్వరలోనే కేసీఆర్ కూడా ప్రజల చేత సస్పెండ్ అవుతాడని హెచ్చరించారు బండి సంజయ్.

హామీలను అమలు చేయలేని వాళ్లను మరమనిషి అనడం తప్పా? అసెంబ్లీ బయట మరమనిషి అన్నందుకే మీకు అంత కోపం వస్తే… అసెంబ్లీలో దేశ ప్రధానిని తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాసిస్టు ప్రధాని అంటే మాకు కోపం రాదా? అని నిలదీశారు.

అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చించాల్సిన చోట… రాజకీయాలను చర్చిస్తున్న కేసీఆర్ ను ఏమనాలి? శాసనసభ వేదికగా ఫాసిస్టు ప్రధాని అని వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. కెసిఆర్ కు ప్రజలే బుద్ధి చెబుతారని.. కెసిఆర్ కు అసెంబ్లీని నడిపే అర్హత లేదని ఆగ్రహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే… మాలో ఒక ఎమ్మెల్యేని ఇప్పటికే జైలుకు పంపించాడు… ఇప్పుడు మరో ఎమ్మెల్యేని సభ నుంచి సస్పెండ్ చేశారని ఫైర్‌ అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version