తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు తర్వాత పాదయాత్ర ప్రారంభించనున్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. 9.30గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం వద్ద ప్రారంభోత్సవ సభలో ప్రసంగించనున్నారు బండి సంజయ్.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, రాజసింగ్, రఘనందనరావు, మురళీదరరావు, పొంగులేటి, ఇతర సీనియర్ నేతలు హాజరుకానున్నారు. పాదయాత్ర లో భాగంగా చార్మినార్, మదీన, అఫ్జల్ గంజ్, బేగంబజార్, మెజంజాహీ మార్కెట్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి, అసెంబ్లీ, లకడీకాపూల్, మసాబ్ ట్యాంక్, మెహిదీపట్నం వరకు నడవనున్నారు బండి సంజయ్. మధ్యాహ్నం భోజనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేయనున్నారు. ఇక రాత్రి బస కోసం మెహిదీపట్నం పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలలో ఏర్పాట్లు చేశారు.
మెదటిరోజు హైద్రాబాద్ మహానగరంలో 10కిలోమీటర్లు నడవనున్న బండి సంజయ్… మెత్రం నాలుగు విడతల్లో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు. మెదట విడత పాదయాత్రను అక్టోబర్ 2 గాంధీజయంతి రోజున హుజురాబాద్ లో ముగించేలా ప్రణాళికలు చేసింది బీజేపీ. పాదయాత్ర ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తున్నారు కమలనాథులు. అయితే.. ఇప్పటి వరకు పోలీసుల నుంచి బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి లభించలేదు.పోలీసుల అనుమతి బీజేపీ పార్టీ ఎదురు చూస్తోంది.