బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పాస్ అయ్యేదా ? Trs లో ఉద్యమ కారులు ఎవరు లేరని ఫైర్ అయ్యారు. Trs లో ఇంకా ఎవరు ఉద్యమ కారులు వుండరు, ఉండబోరని స్పష్టం చేశారు. వివేక్, స్వామి గౌడ్ ఈటల రాజేందర్ వంటి చాలా మంది ఉద్యమ కారులు బీజేపీలో చేరారని.. ఉద్యమ కారులు అందరూ
భవిష్యత్ లో బిజెపిలో చేరబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపిలో పండుగ వాతావరణం కనిపిస్తుందని..ఉద్యమ కారుడు ఈటల పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు. ఉద్యమంలో ఈటెలను దగ్గర నుండి చూసిన వ్యక్తినీ తానేనని… ఉద్యమ టైంలో గానీ ఇప్పుడు కానీ ఉద్యమ కారులకు కష్టాలు వస్తె అండగా ఉండి ఆదుకునే వ్యక్తి ఈటల అని బండి సంజయ్ కొనియడారు.
ఉద్యమంలో కీలక పాత్ర ఈటలది అని… అలాంటి వ్యక్తి కి trs లో ఎలాంటి అవమానం జరిగిందో మన అందరికి తెల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు.బిజెపి లేకుంటే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ బిల్లుకు బిజెపి పార్లమెంట్ లో మద్దతు పలికిందని పేర్కొన్నారు. ఈటెల రాజేందర్ బిజెపి లో జాయిన్ కాగానే కెసిఆర్ కు భయం స్టార్ట్ అయిందని ఎద్దేవా చేశారు. బయట తిరగని దొర బయటకు వచ్చాడని.. ఇక కెసిఆర్ గడీలు బద్దలు కొట్టడమేనని హెచ్చరించారు. నిజమైన ఉద్యమ కారులు ఎవరో… trs లో ఉన్న ఉద్యమ కారులు, మంత్రులు ఎవరో ప్రజలు చూస్తున్నారని చురకలు అంటించారు.