‘బండి’కి టర్నింగ్ పాయింట్..ఇంకా తగ్గేదేలే!

-

రాజకీయాల్లో నాయకులకు ఏదొక సమయంలో టర్నింగ్ పాయింట్లు వస్తాయి..అక్కడ నుంచి ఆ నాయకుల పరిస్తితి మొత్తం మారిపోతుంది. అయితే టర్నింగ్ పాయింట్లు అనేవి రాజకీయంగా ఇంకా పై స్థాయికి ఉపయోగపడతాయి. ఇప్పుడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కూడా అలాంటి టర్నింగ్ పాయింట్ వచ్చింది. గత పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు బండి సంజయ్ అంటే అంతగా ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఆయన ఎంపీగా గెలవడం, ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు అవ్వడం, కేసీఆర్ ప్రభుత్వంపై వరుసగా పోరాటం చేస్తుండటంతో మొత్తం సీన్ మారిపోయింది.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాకే బీజేపీ అనూహ్యంగా రేసులోకి వచ్చింది..టీఆర్ఎస్‌కు చుక్కలు చూపిస్తుంది. ఎక్కడకక్కడ బండి దూకుడు పెంచడానికి పరోక్షంగా టీఆర్ఎస్ కారణం అవుతుంది. అధికార బలంతో బండిని అణిచివేయాలని టీఆర్ఎస్ చూస్తుంది..కానీ అదే బండికి అడ్వాంటేజ్ అవుతుంది. ప్రజల్లో ఇంకా ఆయన ఫాలోయింగ్ పెరగడానికి కృషి చేస్తుంది. ఆ మధ్య ధాన్యం అంశంపై నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్ళిన బండిపై టీఆర్ఎస్ శ్రేణులు రాళ్ళ దాడి చేసిన విషయం తెలిసిందే.

ఆ ఘటన పరోక్షంగా బండికే ఉపయోగపడింది. ఇక తాజాగా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం సర్కారు జారీ చేసిన జీవో 317ను సవరించాలనే డిమాండ్‌తో బండి సంజయ్‌ జాగరణ దీక్షను చేయగా, దాన్ని పోలీసులు భగ్నం చేశారు. అలాగే ఆయన దీక్ష చేస్తున్న పార్టీ ఆఫీసుకు వెళ్ళి కరెంటు సరఫరాను నిలిపివేసి, కిటికీల నుంచి ఫైరింజన్‌తో నీళ్లు చల్లి, ఎంపీ కార్యాలయ ద్వారాన్ని బద్దలు కొట్టి సంజయ్‌ని అరెస్టు చేశారు.

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని చెప్పి ఆయనపై కేసు పెట్టారు. అలాగే బండి సంజయ్‌కి బెయిల్ ఇచ్చేందుకు కరీంనగర్ కోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి, బండి సంజయ్‌కి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆయనను కరీంనగర్ జైలుకు తరలించారు. ఇలా బండిని జైలుకు పంపించారు. అంటే జైలుకు పంపితే బండికి జరిగే నష్టం ఏమి లేదు…ఇంకా ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుంది. టీఆర్ఎస్‌పై ద్వేషం పెరుగుతుంది. మొత్తానికైతే రాజకీయాల్లో బండికి ఇది అతి పెద్ద టర్నింగ్ పాయింట్ కావొచ్చు..ఇక నుంచి బండి రాజకీయం ఇంకా వేరే లెవెల్‌కు వెళ్లొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version