సీఎం రేవంత్ క్యాంప్ ఆఫీసుపై బండి సంజయ్ ఆసక్తికర కామెంట్స్

-

సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి తీరుపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం నగరంలోని జూబ్లీహిల్స్‌లో గల ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. అదేవిధంగా పలువురు నేతలు, అధికారులతోనూ ఇదే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమావేశం అవుతున్నారు.

ప్రభుత్వ అధికారిక, అనధికారిక కార్యక్రమాలు సైతం ఇందులో నుంచే సీఎం ఆపరేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా తన ‘ఎక్స్’ అకౌంట్ వేదికగా బండి సంజయ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్భార్ ఏమైనా జరిగిందా? అని ప్రశ్నించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ‘ప్రజాదర్బార్’ పునరుద్ధరిస్తామని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏమైనా హామీ ఇచ్చిందా? అని సెటైరికట్ పోస్టు చేశారు. ప్రజలు, విద్యార్థుల సమస్యలపై ప్రజాభవన్ వేదికగా సీఎం పనిచేయాలని, క్యాంప్ కార్యాలయం వేదికగా కాదని పరోక్షంగా విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version