తాజాగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా.. యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా తెరకెక్కిన ధమాకా.. ఈ సినిమా మొదటి రోజు నుంచే భారీ వసూళ్లను ను సాధించింది. ఇప్పటికే రూ.50 కోట్ల మేర రాబట్టి.. ఇప్పుడు సక్సెస్ మీట్ నిర్వహించింది నిన్న సాయంత్రం. అయితే ఈ సందర్భంగా బండ్ల గణేష్ చేసిన ప్రసంగం సెన్సేషనల్ గా మారింది.. బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ” ధమాకా మాస్ మీట్ కు నేను ఫోన్ చేసి నేను వస్తానని వచ్చాను.. అస్తమించిన రవిని చూసాం.. ఎప్పటికీ అస్తమించని రవితేజ గురించి మాట్లాడుదామని వచ్చాను.
రవితేజ ఎప్పటికీ వెలుగునిచ్చే సూర్యుడు.. హానెస్టీ.. సిన్సియారిటీ.. రెస్పాన్సిబిలిటీ..ఎవ్రీథింగ్ ఫర్ ఆన్సరబులిటీ .. రవితేజ ఫ్యాన్ గా చెప్పుకోవాలంటే గర్వంగా ఉండాలి. ఆయన చేసిన 70 సినిమాలకు 12 మంది కొత్త దర్శకులను పరిచయం చేసిన ఏకైక హీరో రవితేజ అని బండ్ల గణేష్ తెలిపారు. అన్నీ తెలిసిన వ్యక్తి హీరో రవితేజ.. ధమాకా చిత్రంలో ఒక డైలాగ్ ఉంది. నాకు వెనుక ముందు లేకున్నా.. ఎలా పైకి రావాలో తెలుసు అని చెప్పాడు. ఆ డైలాగు 100% కరెక్ట్.
అందరూ ఒక సంవత్సరం ట్రై చేస్తారు. ఒకరు రెండేళ్లు, మూడేళ్లు ప్రయత్నిస్తారు. అదృష్టం కలిసి సూపర్ స్టార్, మెగాస్టార్ లు అవుతారు. కానీ ఆఖరికి ప్రొడక్షన్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, నేను చచ్చిపోవడం సినిమా పరిశ్రమలోనే.. అని తన లక్ష్యాన్ని కోరికను తీర్చుకున్న వ్యక్తి రవితేజ తాను ఎదుగుతూ.. వందల మందికి అవకాశాలు ఇచ్చిన వ్యక్తి రవితేజ ” అంటూ ఆకాశానికెత్తేశారు బండ్ల గణేష్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.