తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌ విడుదల..

-

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ  రాష్ట్రంలో గ్రూప్-1 తర్వాత నిరుద్యోగులు ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్న గ్రూప్-2 ఉద్యోగ నోటిఫికేషన్ ను టిఎస్పిఎస్సి గురువారం జారీ చేసింది. దీని కింద మొత్తం 18 ప్రభుత్వ విభాగాల పరిధిలోని 783 పోస్టులను భర్తీ చేయనుంది.

ఈ పోస్టులకు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. గ్రూప్-2 లో అత్యధికంగా సాధారణ పరిపాలన విభాగంలో సహాయ సెక్షన్ అధికారుల పోస్టులు 165, మండల పంచాయతీ అధికారులవి 126, నాయబ్ తహసిల్దారులవి 98, ప్రొబేషనరీ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 97 ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version