టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఒకప్పుడు సినిమా ఫంక్షన్ల వేదికలపై మాట్లాడిన స్పీచులు గుర్తుకు వచ్చేవి. ఇప్పుడైతే రాజకీయాల్లోకి మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి. రాజకీయాల్లోకి దిగి.. కోటలు దాటే మాటలతో నవ్వుల పాలయ్యాడు. బండ్ల గణేష్ కాస్తా.. బ్లేడ్ గణేష్ అనే స్థాయికి దిగజారిపోయాడు.
అదంతా కాసేపు పక్కకు పెడితే.. తాజాగా టాలీవుడ్ హీరోలపై ఫైర్ అయ్యారు. సుధీర్ బాబు హీరోగా నటించిన ఆఅమ్మాయిగురించిమీకుచెప్పాలి ప్రీ రిలీజ్ కు వచ్చిన DJ టిల్లు హీరో సిద్దు, అడవి శేషు లపై మండిపడ్డారు బండ్ల గణేష్. ఈ ఈవెంట్ లో హీరో సిద్దు, అడవి శేషులు కూర్చున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ.. పవన్ కళ్యాణ్ లాగా పద్దతిగా ఉండాలని చురకలు అంటించారు. మొన్న విజయ్ దేవరకొండకు వార్నింగ్ ఇచ్చిన బండ్ల గణేష్.. ఇప్పుడు హీరో సిద్దు, అడవి శేషుల ఫోటోలు షేర్ చేసి.. నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్.. మా దేవన్ని దయచేసి నేర్చుకోండి ఆచరించండి అది మన ధర్మం అంటూ మండిపడ్డారు.
నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర దయచేసి నేర్చుకోండి ఆచరించండి అది మన ధర్మం @PawanKalyan 🙏 pic.twitter.com/3nkOVsMIor
— BANDLA GANESH. (@ganeshbandla) September 13, 2022