షార్జాలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీ 31వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీంపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 171 పరుగుల స్కోరు చేసింది. మ్యాచ్‌లో బెంగళూరు జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.
బెంగళూరు బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ కోహ్లి, క్రిస్ మోరిస్‌లు రాణించారు. 39 బంతులు ఆడిన కోహ్లి 3 ఫోర్లతో 48 పరుగులు చేయగా, మోరిస్ 8 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సర్లతో 25 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కాగా బెంగళూరు డివిలియర్స్, కోహ్లిల వికెట్లను కోల్పోవడంతో 150 లోపే ఇన్నింగ్స్‌ను ముగిస్తుందని అనుకున్నారు. కానీ చివర్లో మోరిస్ చెలరేగడంతో బెంగళూరు ఆ స్కోరు చేయగలిగింది.
పంజాబ్ బౌలర్లలో మహమ్మద్ షమీ, ఎం అశ్విన్‌లు చెరో 2 వికెట్లు తీశారు. అర్షదీప్ సింగ్, క్రిస్ జోర్డాన్‌లు చెరొక వికెట్ తీశారు. అయితే చివరి వరకు బెంగళూరును పంజాబ్ కట్టడి చేసినట్లు కనిపించినా ఆఖరి ఓవర్లలో బౌలర్లు పట్టుకోల్పోయారు. ఈ క్రమంలో బెంగళూరు రక్షణాత్మక స్కోరు చేయగలిగింది.