Bangarraju: స‌రిగ్గా ఐదేండ్ల త‌రువాత సంక్రాంతికి వ‌స్తున్న బంగార్రాజు! ఆ సెంటిమెంట్ ను ఫాలోవుతున్నారా మ‌రీ!

-

Bangarraju: టాలీవుడ్ మ‌న్మ‌ధుడు కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్నచిత్రం బంగార్రాజు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా మూవీ “బంగార్రాజు” గతంలో వ‌చ్చిన‌ “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి ఇది సిక్వెల్ గా తెర‌కెక్క‌తుంది. ఈ చిత్రంలో నాగ్ “బంగార్రాజు” పాత్రల్లో కనిపించ‌బోతున్నారు. మనసును దోచేందుకు డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ టాగ్ జోడించారు. అలాగే.. ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైన్ గా వ‌స్తున్న ఈ చిత్రంలో నాగ్ తో నాగ చైతన్య మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఈ చిత్రంతో తండ్రి కొడుకులు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయడానికి వస్తున్నారు.

అయితే.. ఈ చిత్రం ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సిండే.. కానీ, కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడి .. విడుద‌ల లేట్ అయ్యింది. అయితే ఎట్టకేలకు చిత్ర యూనిట్ సినిమాను పూర్తి చేసే పనిలో పడింది. ఈ సినిమాలో చైతూకు జంట‌గా కృతి శెట్టి నటిస్తుండగా, నాగార్జునకు జంటగా రమ్యకృష్ణలు క‌నిపించనుంది. ఈ క్ర‌మంలో ఈ సినిమా విడుదలకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర వార్త వైర‌ల్ అవుతుంది.

బంగార్రాజు చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్ష‌కుల ముందుకు తేవ‌డానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు జనవర్‌ 15న సినిమాను విడుదల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం 2016లో సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైంది. ఇప్పుడు సరిగ్గా ఐదేళ్ల తర్వాత సీక్వెల్‌ను అదే రోజు విడుదల చేయనున్నారన్నమాట .

ఇదిలా ఉంటే… వచ్చే సంక్రాంతికి బాక్స్ ఆఫీసు వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిసేలా ఉంది. ఇప్పటికే ఆర్‌.ఆర్‌.ఆర్ జనవరి 7న విడుదల కానుండ‌గా.. భీమ్లా నాయక్‌ జనవరి 12, సర్కారు వారి పాట జనవరి 13, రాధేశ్యామ్‌ జనవరి 14 తేదీలను లాక్‌ చేసుకున్నాయి. మరి ఈ పోటీలోకి బంగార్రాజు దిగుతాడా.. లేదా తెలియాలంటే చిత్ర విడుదలపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version