బంగ్లాదేశ్ క్రికెట్ లో ఒక సంచలనాన్ని సృష్టించిన ఓపెనర్ తమీమ్ ఇక్బల్ ఈ మధ్యనే అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. కానీ అతని రిటైర్మెంట్ ఇచ్చిన రెండవ రోజునే బంగ్లాదేశ్ ప్రధాని తమీమ్ తో మాట్లాడి దేశానికి నీ అవసరం ఎంతో ఉందని ఒప్పించి రిటైర్మెంట్ ను వెనక్కు తీసుకునేలా చేశారు, కానీ రీసెంటుగా తమీమ్ ఇక్బల్ నేను కేవలం ప్లేయర్ గానే కొనసాగుతాను కెప్టెన్ గా చేయడానికి ఇష్టం లేదు అని చెప్పడంతో మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది. ఇప్పుడు బంగ్లాదేశ్ కు వన్ డే కెప్టెన్ ను నియమించడానికి కసరత్తులు చేస్తోంది. కాగా షకిబుల్ హాసన్ ఆల్ రౌండర్ గా క్రికెట్ జట్టుకు ఎన్నో సేవలను అందించాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అతన్ని తర్వాత వన్ డే కెప్టెన్ గా చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. కానీ షకిబుల్ హాసన్ కు ఏమాత్రం ఆసక్తి లేదని తెలుస్తోంది. అయినప్పటికీ షకిబుల్ హాసన్ ను ఎలాగైనా ఒప్పించే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ జట్టును ప్రకటించాల్సి ఉంది.
బంగ్లాదేశ్ వన్ డే కెప్టెన్ గా తమీమ్ స్థానంలో షకిబుల్ హాసన్ … కానీ ?
-