ఇవాల్టి నుంచి ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి డాకా వేదికగా ఈ రెండో టెస్టు ప్రారంభం కానుంది. మొదటి టెస్టులో గెలిచిన టీమిండియా రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని దూకుడుగా ఉంది. అయితే, మ్యాచ్ లో టాస్ నెగ్గిన బంగ్లాదేశ్.. మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బౌలింగ్ చేయనుంది ఇండియా.
జట్ల వివరాల్లోకి వెళితే
ఇండియా :శుభమన్ గిల్, కేఎల్ రాహుల్ (సి), ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (డబ్ల్యూకే), శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్
బంగ్లా XI: మహ్మదుల్ హసన్, జాకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్ (WK), షకీబ్ అల్ హసన్ (C), మెహిదీ హసన్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, తస్కిన్ అహ్మద్/ నసుమ్ అహ్మద్.