ఉమెన్ ట్రాఫికింగ్, డ్రగ్స్ ఈ మధ్య బాగా వినిపిస్తుంది. ఓ ప్రబుద్ధుడు ఏకంగా 75 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఉపాధి ఇప్పిస్తానని చెప్పి మహిళలకు వలవేసి వారిని వ్యభిచారంలోకి దింపాడు. అలా ఏకంగా 200 మంది అమ్మాయిల్ని నరకకూపంలోకి నెట్టి.. ఆ డబ్బులతో తను జల్సాలు చేసేవాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఇప్పటివరకూ 30మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన మునిర్ ను గుజరాత్ లోని సూరత్ లో పోలీసులకు పట్టుబడ్డాడు. బంగ్లాదేశ్ లోని జాసుర్ కు చెందిన మునిర్ అలియాస్ మునిరుల్.. ఆ దేశానికి చెందిన యువతులను ఉపాధి నెపంతో భారత్లోకి అక్రమ రవాణా చేసేవాడు.
పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్ మీదుగా ఈ వ్యవహారం సాగేది. ఈ క్రమంలో సరిహద్దులోని అధికారులకు మునిర్ రూ. 25 వేల చొప్పున లంచం ఇచ్చేవాడు. దాంతో ఆ పోలీసులు ఆంక్షలు పెట్టేవారుకాదు. ఆ తర్వాత బంగ్లాదేశ్ యువతులను ముంబై, కోల్కతా ప్రధాన కేంద్రాలుగా మునిర్ ఆ యువతులను వ్యభిచారంలోకి దింపేవాడని పోలీసులు తెలిపారు.ఇప్పటివరకు ఇలా 200 మంది యువతులను భారత్లోకి అక్రమ రవాణా చేసినట్లు తేలింది.. మునీర్ సెక్స్ రాకెట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఉపాధి పేరుతో అమాయులైన అమ్మాయులకు వలవేసి ఈ రాకెట్ నడిపించారు. వెలుగులోకి వచ్చిన ఉదాంతం ఇది. కానీ ఈ ఉక్కులో చిక్కుకున్న వారెందరో ఉన్నారు. మధ్యతరగతి కుటుంబం, ఆర్థికపరిస్థితి అంతంమాత్రం ఇలాంటి కోవలోని అమ్మాయిలే వీళ్లకు టార్గెట్.