మే నెల చివరకు వచ్చేసింది.. ఇంకొన్ని రోజుల్లో జూన్ ప్రారంభవుతుంది..జూన్ లో బ్యాంకు సెలవులకు సంబంధించి జాబితాను ఆర్బీఐ విడుదల చేసేసింది. చాలామంది.. తమకు వీలున్నప్పుడు బ్యాంకుకు వెళ్తారు. వీక్ డేసే కదా.. బ్యాంకు ఉంటుందిలే అన్న ధైర్యం.. కానీ తీర అక్కడికి వెళ్లి చూస్తే.. బ్యంకుకు సెలవుంటుంది. చాలాసార్లు ఇదే జరుగుతుంది.. లేదా.. కొంతమంది తెలివైనవాళ్లు అయితే.. బ్యాంకుకు వెళ్లే ముందు..అసలు ఈరోజు బ్యాంకులు ఉన్నాయా లేవా అని గూగుల్ చేస్తారు. దాన్ని బట్టి డిసైడ్ అవుతారు. ఇదంతా ఎందుకు.. ఓసారి అసలు మే నెలలో ఏం ఏం రోజుల్లో బ్యాంకులకు సెలవు ఉందో ఓ లుక్కేద్దామా..! ఓ పనైపోతుంది.!
ఆర్బీఐ రాష్ట్రాల పండుగల ప్రకారం సెలవులను ప్రకటించింది. శనివారం, ఆదివారం కాకుండా ఈ నెలలో రాష్ట్రాలలో వచ్చే కొన్ని ప్రత్యేక సెలవులు ఉన్నాయి. వాటి గురంచి పూర్తిగా తెలుసుకుందాం.
జూన్ 2 – మహారాణా ప్రతాప్ జయంతి / తెలంగాణ వ్యవస్థాపక దినోత్సవం – హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, తెలంగాణలలో సెలవు
జూన్ 3 – శ్రీ గురు అర్జున్ దేవ్ జీ అమరవీరుల దినోత్సవం – (ఈ రోజున పంజాబ్‌లో మాత్రమే సెలవు ఉంటుంది)
జూన్ 5 – ఆదివారం
జూన్ 11 – రెండవ శనివారం
జూన్ 12 – ఆదివారం
జూన్ 14 – సాధువు గురు కబీర్ జన్మదినం – ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, హర్యానా, పంజాబ్‌లో సెలవు
జూన్ 15వ తేదీన గురు హర్‌గోబింద్ జయంతి సందర్భంగా ఒడిశా, మిజోరం, జమ్మూకాశ్మీర్ బ్యాంకులు పని చేయవు.
జూన్ 19న ఆదివారం,
జూన్ 22న ఖార్చీ పూజ వల్ల త్రిపురలో బ్యాంకులకు సెలవు
జూన్ 25న నాలుగో శనివారం,
జూన్ 26న ఆదివారం సెలవులు ఉంటాయి.
జూన్ 30న స్థానిక పండగ వల్ల మిజోరంలో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
-Triveni Buskarowthu