సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా పర్యటన కొనసాగుతోంది. జిల్లాలోని దుద్యాల్ మండలం పోలేపల్లికి చేరుకున్నారు. కాసేపటి క్రితం పోలేపల్లి రేణుకా ఎల్లమ్మ కు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంతో పాటు మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో సహ పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. కాగా మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా పర్యటనకు బయల్దేరనున్నారు.
నారాయణపేట జిల్లాలోని అప్పకపల్లి లో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పూర్తిగా మహిళలచే నడిచే పెట్రోల్ బంక్ ను సీఎం ప్రారంభించనున్నారు. అలాగే అప్పకపల్లిలో మొదటి విడత ఇందిరమ్మ
ఇండ్ల నిర్మాణాల శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నారాయణపేట మెడికల్ కాలేజీలో అకడమిక్ బ్లాక్ తో పాటు, ఇతర భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. దాని తర్వాత గురుకుల హాస్టల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.