బ్యాంకుల్లో పనిచేసే సిబ్బంది అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తుండడం సహజం. కానీ కొన్ని సార్లు వారు చేసే పొరపాట్ల వల్ల ఇతరుల ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి చేరుతుంది. ఇలాంటి సందర్భాల్లో కొందరు డబ్బును ఖాతా నుంచి తీసుకుంటారు. కానీ ఆ దంపతులు మాత్రం అలా చేయలేదు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ఉన్న బేటన్ రోగ్ అనే ప్రాంతానికి చెందిన డారెన్ జేమ్స్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆ దంపతులకు చెందిన జాయింట్ ఖాతాలో ఇటీవల భారీ మొత్తంలో డబ్బు జమ అయింది. 50 బిలియన్ డాలర్లను వారి బ్యాంక్ పొరపాటున వారి ఖాతాలో జమ చేసింది. అయితే తమ ఖాతాలో అంత భారీ మొత్తం ఉండడాన్ని గమనించిన జేమ్స్ వెంటనే బ్యాంకును సంప్రదించాడు.
ఈ క్రమంలో బ్యాంక్ వారు తప్పిదం జరిగిందని తెలుసుకుని కంప్లెయింట్ నమోదు చేశారు. తరువాది కొద్ది రోజులకు ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే ఇలాంటి సందర్భాల్లో బ్యాంకులో జమ అయిన మొత్తాలను తీసి ఖర్చు చేస్తే అమెరికా చట్టాల ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. కానీ జేమ్స్ దంపతులు అలా చేయలేదు. దీంతో బ్యాంకు ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంది.
ఇక 2019లో అమెరికాకు చెందిన ఓ మహిళ ఖాతాలోనూ ఇలాగే నగదు పొరపాటున జమ అయింది. రూత్ బాలన్ అనే మహిళకు అక్కడి లెగసీ టెక్సాస్ బ్యాంక్‌లో ఖాతా ఉంది. అందులో బ్యాంకు వారు పొరపాటున 37 మిలియన్ డాలర్లను జమ చేశారు. కానీ తప్పు తెలుసుకుని వెంటనే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారు.