ఎస్బీఐ వినియోగదారులకు గుడ్ న్యూస్.. రూ.36 లక్షల ప్రయోజనం..పూర్తీ వివరాలు..

-

ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ తన కస్టమర్ల కోసం కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది..దీని ద్వారా వినియోగదారులు ఇప్పుడు ఇంట్లో కూర్చొని రూ. 36 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. పెరుగుతున్న డిజిటలైజేషన్ యుగంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఆన్‌లైన్‌లో వివిధ సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో SBI తన కస్టమర్ల కోసం ఇంట్లో కూర్చొని వ్యక్తిగత రుణం పొందే సౌకర్యాన్ని కూడా ప్రారంభించింది. దాని పేరు ‘రియల్ టైమ్ ఎక్స్ ప్రెస్ క్రెడిట్’.
ఈ సదుపాయం ద్వారా వినియోగదారులు కొన్ని సులభమైన దశల్లో రూ. 36 లక్షల వరకు వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. మీరు స్టేట్ బ్యాంకుకు చెందిన మొబైల్ బ్యాంకింగ్ యాప్ యోనో యాప్ ద్వారా ఈ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ సదుపాయాన్ని పొందవచ్చు..దీని గురించి పూర్తీ వివరాలను తెలుసుకుందాం..

ఈ సదుపాయాన్ని కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ రంగంలో పనిచేసే వ్యక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. లోన్‌ ధృవీకరణ తర్వాత మీరు ఆదాయ ధృవీకరణ పత్రం, ITI ఫారం, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వంటి మీ అన్ని పత్రాలను అందించాల్సి ఉంటుంది. అలాగే లోన్ ఇచ్చే ముందు సిబిల్ స్కొర్ ను కూడా చెక్ చేసుకోవాలి.

ఈ సదుపాయం ద్వారా మీరు రూ.36 లక్షల వరకూ ప్రయోజనం పొందవచ్చు..మీరు ఆన్‌లైన్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనితో పాటు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, లోన్ అప్రూవల్ ప్రక్రియ కూడా YONO యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో జరుగుతుంది..దీని గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవాలంటే ఎస్బీఐ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు..

Read more RELATED
Recommended to you

Exit mobile version