రేపటి నుంచి అందుబాటులోకి ‘డిజిటల్ కరెన్సీ’

-

డిజిటల్​ కరెన్సీని(హోల్​సేల్​) నవంబర్​ 1 నుంచి ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్ల రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ప్రకటించింది. ‘సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)’గా వ్యవహరించే డిజిటల్​ రూపాయి లావాదేవీలను రేపు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ సెక్యూరిటీస్​లోని సెకండరీ మార్కెట్​ లావాదేవీలకు మొదట డిజిటల్​ రూపాయిని ప్రయోగాత్మకంగా వినియోగించనుట్లు పేర్కొంది.

స్టేట్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్ర బ్యాంక్, యెస్ బ్యాంక్​, ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్​ఎస్​బీసీ బ్యాంకును పైలెట్ ప్రాజెక్ట్​లో భాగస్వాములను చేస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. నెల రోజుల వ్యవధిలోనే రిటైల్​ రంగంలోనూ డిజిటల్ రూపాయిని ప్రారంభిస్తామని తెలిపింది. అక్రమ నగదు చలామణీని అరికట్టేందుకు ‘డిజిటల్‌ రూపాయి’ తీసుకుస్తున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది.

ప్రస్తుతం మన నగదును డిజిటల్‌ రూపంలోకి మార్చుకుని, వినియోగించుకుంటున్నాం. ఈ చెల్లింపులకు బాధ్యత వాణిజ్య బ్యాంకులది అయితే, సీబీడీసీ చెల్లింపులకు ఆర్‌బీఐ బాధ్యత వహిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version