స్టేట్ బ్యాంక్ హోమ్ లోన్ ఆఫర్.. ఎనిమిది లక్ష వరకు బెనిఫిట్..!

-

మీరు సొంతింటి కలని సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు శుభవార్త. పండుగ సీజన్ కావడం వలన స్టేట్ బ్యాంక్ భారీ ఆఫర్లు ప్రకటించింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ మొత్తంతో సంబంధం లేకుండా అన్ని గృహ రుణ వడ్డీ రేట్లను 6.7 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే లోన్ తీసుకోవాలని అనుకునే వాళ్ళ క్రెడిట్​ స్కోరు ఆధారంగా వడ్డీ రేటు ఉంటుంది.

 

SBI

అలానే ఈ ఆఫర్​ కింద ప్రాసెసింగ్​ ఫీజు కూడా మినహాయించినట్లు పేర్కొంది స్టేట్ బ్యాంక్. ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు అయితే రూ.75 లక్షలకు పైన గృహ రుణానికి ఎస్​బీఐ కస్టమర్లు 7.15 శాతం వడ్డీ రేటు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఈ ఆఫర్ లో 6.70 శాతానికే గృహ రుణాలను అందించనుంది. రూ. 75 లక్షల రుణాన్ని 30 ఏళ్ల కాలవ్యవధితో పొందవచ్చని తెలిపింది.

ఈ ఆఫర్​ వల్ల 45 బేసిస్​ పాయింట్ల వడ్డీ ఆదా తో పరోక్షంగా రూ.8 లక్షల వరకు భారీగా వడ్డీని రుణ గ్రహీతలు ఆదా చేసుకోవచ్చని వివరించింది. గతంలో వేతన జీవుల హోమ్​లోన్​ తీసుకుంటే 15 బేసిస్​ పాయింట్ల మేర అధిక వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అంతరాన్ని ఎస్​బీఐ తొలగించింది. ఇక నుండి అందరికీ ఒకే రకమైన వడ్డీ రేటును అమలు చేయనుంది. ఉద్యోగేతరులు తీసుకునే రుణాలపై 45+15 మొత్తం 6‌‌0 బేసిస్​ పాయింట్ల వరకు వడ్డీ ఆదా చేసుకోవచ్చని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version