టీ 20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలిందని నిన్నటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బౌలింగ్ బ్యాక్ బోన్ జస్ప్రీత్ బూమ్రా బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నాడు. సౌతాఫ్రికా సిరీస్ తో పాటు టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కు దూరం అయ్యాడు. ఇది ఏ మాత్రం ఊహించని పరిణామమే. దీంతో బూమ్రా టి20 వరల్డ్ కప్ కు దూరమైనట్లుగా వార్తలు పుట్టుకొచ్చేసాయి.
ఇవి చాలావన్నట్లు, బుమ్రా గాయపడడానికి ఐపీఎల్ కారణమని, దాన్ని బ్యాన్ చేయాలంటూ విమర్శలు వస్తున్నాయి. ఇవి ఎక్కడి వరకు దారి తీస్తాయో అని భయపడ్డా బీసీసీఐ అధ్యక్షుడు, బుమ్రా టి20 వరల్డ్ కప్ కు దూరం కాలేదనే వార్తను మోసుకు వచ్చారు.
“బుమ్రా టి20 వరల్డ్ కప్ కు దూరం కాలేదు, టోర్నీ ప్రారంభం కావడానికి ఇంకా 15 రోజులు సమయం ఉంది. అప్పటివరకు అతడు కోలుకోవచ్చు” అని తెలిపాడు. నిజానికి ఈ బుమ్రా కు గాయమైనట్టు వార్తలు వస్తున్నప్పటికీ, అతడు వెన్నెముక ఫ్రాక్చర్ కు సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. ఇది వాస్తవం. అలా కనుక అతడు సర్జరీ చేయించుకుంటే ఆరు నెలల పాటు బెడ్ రెస్ట్ తప్పక అవసరం అవుతుంది. మరి టీ 20 వరల్డ్ కప్ వరకు జస్ప్రీత్ బూమ్రా వస్తాడో లేదో చూడాలి.