కరోనా దృష్ట్యా బీసీసీఐ కీలక నిర్ణయం.. రంజీ ట్రోఫీ వాయిదా

-

దేశంలో క‌రోనా వైర‌స్, ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉండ‌టం, రోజు రోజుకు కేసులు విప‌రీతంగా పెరుగుతున్న నేప‌థ్యంలో బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశవాలీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీని వాయిదా వేస్తు బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంది. కాగ రంజీ ట్రోఫీ ఈ నెల 13 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ టోర్నమెంట్ కు ముందు రంజీ ట్రోఫీలో పాల్గొనే ఆట‌గాళ్ల‌కు, సిబ్బందికి క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. అలాగే దేశంలో కోవిడ్ కేసులు కూడా ముప్పై వేలకు పైగానే వ‌స్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో రంజీ ట్రోఫీని నిర్వ‌హించ‌డం సాధ్యం కాద‌ని బీసీసీఐ అభిప్రాయ ప‌డింది.

అందులో భాగంగానే ఈ టోర్నీని వాయిదా వేస్తు నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఈ టోర్నీని తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తార‌నే విష‌యం పై బీసీసీఐ క్లారిటీ ఇవ్వ‌లేదు. ఇదీల ఉండ‌గా.. రంజీ ట్రోఫీ వాయిదా గురించి బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీని ఒక స‌మావేశంలో మీడియా ప్ర‌తినిధులు అడ‌గా.. ఎట్టి ప‌రిస్థితుల్లో రంజీ ట్రోఫీని నిర్వ‌హించి తీరుతామ‌ని గంగూలీ అన్నారు. కానీ రంజీ ట్రోఫీలో పాల్గొనే ఆట‌గాళ్లకు, సిబ్బంది క‌రోనా సోక‌డంతో చివ‌రికి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version