టర్నింగ్ పాలిటిక్స్: ఆ వైసీపీ మంత్రికి మాజీ మంత్రి దెబ్బ… !

-

ఏపీ మంత్రి పేర్ని నానికి బందరు ప్రజలు షాక్ ఇస్తున్నారా ? మాజీ మంత్రి కొల్లు రవీంద్రకి సానుభూతి పెరిగిందా ? అంటే పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పేర్ని నాని 2019 ఎన్నికల్లో కొల్లు రవీంద్రపై కేవలం 5 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. అంతటి జగన్ గాలిలో కూడా పేర్నికి 5 వేల మెజారిటీనే వచ్చిందంటే ప్రత్యర్ధి కొల్లు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో చెప్పొచ్చు.

అయితే పేర్ని అధికారంలోకి రావడం, పైగా మంత్రి కూడా అవ్వడంతో బందరులో ఆయన డామినేషన్ పెరిగింది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాగానే అందుబాటులో ఉండే నాని ఇప్పుడు మంత్రి అయ్యాక కాస్త ప్రజలకు దూరమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో ఆయన కుమారుడు కూడా నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారు. ఇటు ప్రతిపక్షంలో ఉన్న కొల్లు ప్రజా సమస్యలపై గట్టిగానే పోరాటం చేస్తూ వచ్చారు. ఓడిపోయిన దగ్గర నుంచి ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. అటు రాజధాని అమరావతి కోసం పోరాడుతూ, చంద్రబాబుకు సపోర్ట్‌గా ఉన్నారు. ఇలా దూకుడుగా ఉన్న కొల్లుని ఓ వైసీపీ నేత హత్య కేసులో ప్రభుత్వం జైలుకు పంపింది. బందరులో స్థానికంగా ఉన్న గొడవల నేపథ్యంలో కొందరు ఓ వైసీపీ నేతని హత్య చేశారు. అయితే హత్య చేసిన వారి వెనుక కొల్లు రవి ఉన్నారని చెప్పి, పోలీసులు ఆయనపై కూడా కేసు నమోదు చేసి జైలులో పెట్టారు.

ఇక ఆయన్ని కావాలనే అరెస్ట్ చేశారనే విషయం ప్రజ‌ల్లోకి బ‌లంగా తీసుకు వెళ్ల‌డంలో టీడీపీ స‌క్సెస్ అయ్యింది. పైగా కొల్లు బీసీ కావ‌డంతో బీసీ నినాదం అక్క‌డ బ‌లంగా వ‌ర్క‌వుట్ అయ్యింది. న్యూట్ర‌ల్‌గా ఉన్న బీసీలు కూడా రోడ్ల‌మీద‌కు వ‌చ్చారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో బందరు ప్రజల్లో కొల్లుపై సానుభూతి పెరిగింది. నియోజకవర్గంలోని బీసీ వర్గాలు ఆయనకు అనుకూలంగా మారారు. పైగా బందరులో కీలకంగా కొల్లు సొంత సామాజికవర్గం మత్స్యకారులు మొన్న ఎన్నికల్లో కాస్త నాని వైపు మొగ్గు చూపారు.

ఇక ఇప్పుడైతే వారు ఎక్కువశాతం కొల్లు వైపు వచ్చేశారు. అటు మిగతా బీసీ వర్గాల్లో కూడా కొల్లుపై సానుభూతి వచ్చింది. ఇప్పుడు బెయిల్ మీద బయటకొచ్చిన కొల్లు బందరులో టీడీపీని బలోపేతం చేసే దిశగా పనిచేసేందుకు రెడీ అయ్యారు. మొత్తానికైతే బందరు పాలిటిక్స్ బాగానే టర్న్ అయినట్లు కనిపిస్తున్నాయి. మంత్రి పేర్ని నాని ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా అడుగులు వేయ‌క‌పోతే ఆయ‌న‌కు ఇబ్బంది త‌ప్ప‌దు.

-Vuyyuru Subhash 

Read more RELATED
Recommended to you

Exit mobile version