మీ స్మార్ట్ ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా? అయితే జాగ్రత్త!

-

ప్రస్తుతం టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందింది. దీంతో స్మార్ట్ ఫోన్ల వాడకం అధికమైంది. పెరుగుతున్న టెక్నాలజీతోపాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లలో మాల్వేర్ సాఫ్ట్ వేర్‌లను పంపిస్తూ యూజర్ల డేటాను సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలో రకరకాల మాల్వేర్‌ సాఫ్ట్ వేర్‌లు తయారయ్యాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే గ్యాడ్జెట్లపై మాల్వేర్‌ల దాడి ఎక్కువైంది. సైబర్ నేరగాళ్లు స్మార్ట్ ఫోన్లను టార్గెట్ చేస్తూ దాడులు నిర్వహిస్తున్నారు.

మాల్వేర్-సాఫ్ట్ వేర్

ఈ క్రమంలో గూగుల్ ఎప్పటికప్పుడు మాల్వేర్‌లతో కూడిన యాప్స్ ను గుర్తించి వినియోగదారులను హెచ్చరిస్తోంది. స్మార్ట్ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలేట్ చేసుకోవాలని సూచిస్తోంది. తాజాగా 8 యాప్‌లను విడుదల చేసి.. వీటిని వెంటనే డిలీట్ చేసుకోవాలి పేర్కొంది. వ్లోగ్ స్టార్ వీడియో ఎడిటర్, క్రియేటివ్ 3డీ లాంచర్, వావ్ బ్యూటీ కెమెరా, జిఫ్ ఎమోజీ కీబోర్డ్, రేజర్ కీబోర్డ్ అండ్ థీమ్, ఫ్రీ గ్లో కెమెరా 1.0.0, కోకో కెమెరా వీ1.1, ఫన్నీ కెమెరా బై కెల్లీ టెక్. ఈ యాప్‌లు మీ ఫోన్‌లో వెంటనే డిలీట్ చేసుకోవాలని గూగుల్ సూచిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version