ఆర్థిక సంవత్సరం ముగిసిపోయిన తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. దీని కోసం మనం ప్లాన్ చేసుకొని రెడీగా ఉండాలి. ముఖ్యంగా పన్ను ఆదా కోసం చేసే పెట్టుబడి లాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి. అయితే మార్చి 31వ తేదీలోగా మనం పూర్తి చేయాల్సిన పనులు గురించి చూద్దాం. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
మార్చి 31వ తేదీలోగా పన్ను విషయంపై జాగ్రత్తపడాలి. సెక్షన్ 80సి కింద వర్తించే మినహాయింపులుని వాడుకున్నారా లేదా చూసుకోండి. కొన్ని పథకాలు లో డబ్బులు పెట్టడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. సెక్షన్ 80 సి పరిమితి 1,50,000 రూపాయలు. ఇది పూర్తి కాకపోతే అనుకూలమైన ఆ పెట్టుబడి పథకాన్ని మీరు ఎంచుకోండి. మార్చి 31వ తేదీలోగా తప్పనిసరిగా కనీసం మొత్తం అయినా పెట్టుబడి పెట్టాలి. అలానే మార్చి 31లోగా రిటర్న్స్ ఫైల్ చేయాలి. 31వ తేదీ తర్వాత వాటిని ఫైల్ చేయడం అవ్వదు.
ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ చేయడం:
మార్చి 31వ తేదీ తర్వాత ఈ రెంటినీ లింక్ చేయడం అవ్వదు. కనుక ఈ లోగానే మీరు రెండిటినీ లింక్ చేయండి.
కేవైసీ:
మీ బ్యాంకు ఖాతా లో మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి. నిబంధనలు పూర్తి చేయండి. పాన్ ఆధార్ కార్డు, చిరునామా వంటి వాటితో పాటు బ్యాంకు అడిగిన వివరాలను కూడా 31వ తేదీలోగా ఇవ్వండి.
వివాద్ సే విశ్వాస్ పథకం:
ఈ పథకంలో భాగంగా ఏదైనా పన్ను బాకీ ఉంటే దానిని చెల్లించాలి. కనుక 31వ తేదీ లోగా ఈ పనులన్నీ మర్చిపోకుండా పూర్తి చేయండి.