Beast : “బీస్ట్” తెలుగు ట్రైలర్ రిలీజ్.. దుమ్ము లేపిన విజయ్

-

త‌మిళ స్టార్ హీరో విజ‌య్, బ్యూటీఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే క‌లిసి న‌టించిన సినిమా బీస్ట్. ఈ సినిమా విడుద‌లకు ముందే రికార్డుల‌ను తిర‌గ‌రాస్తుంది. ఇటీవ‌ల విడుద‌ల త‌మిళ వ‌ర్షన్ ట్రైల‌ర్ కూడా దూసుకుపోతుంది. కాగా ఈ బీస్ట్ సినిమా నుంచి అర‌బిక్ కుత్తు అనే సాంగ్ ఫిబ్ర‌వ‌రి నెల‌లో విడుద‌ల అయిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే… సినిమాలో సోల్జర్ గా… విజయ్ దళపతి దుమ్ము దులిపాడు. అలాగే.. తన ఫైట్స్, యాక్షన్ తో.. అలరించాడు విజయ్. అటు ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందరినీ అలరిస్తోంది. మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తే… విజయ్ ఖాతాలో మరో బిగ్గెస్ట్ హిట్ పడినట్లేనని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. కాగా బీస్ట్ సినిమా ఏప్రిల్ 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version