తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక కి మంత్రివర్గం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.అయితే కొత్త ఆర్థిక మంత్రిగా అలీ సబ్రీ బాద్యతలను చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి కొత్త ఆర్థిక మంత్రిగా వచ్చారు.ఇప్పటిదాకా ఆర్థికమంత్రిగా ఉన్న బాసిల్ రాజపక్స ను దేశ అధ్యక్షుడు గోటబాయ రాజపక్సే తొలగించారు. బాసిల్ రాజపక్స..సాక్షాత్తు దేశ అధ్యక్షుడు గొటబాయ కు సోదరుడే. అయినప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితి మరీ విషమిస్తున్న నేపథ్యంలో తన సోదరున్ని ఉపేక్షించలేక పోయారు.
బాసిల్ ను తప్పించి కొత్త ఆర్థిక మంత్రిగా అలీ సబ్రీ కి భాద్యతలు అప్పగించారు. అలీ సబ్రీ ఇప్పటిదాకా న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. మరి కొత్త ఆర్థికమంత్రి రాకతో శ్రీలంక దశ మారుతుందా అంటే సవాలక్ష సవాళ్లు ఎదురుచూస్తున్నాయి. ద్రవ్యోల్బణం రాకెట్లా దూసుకుపోతున్న తరుణంలో అలీ సబ్రీ ఏం చేయగలరు అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. మరి కొన్ని వారాలపాటు శ్రీలంకలో ఇదే తరహా పరిస్థితులు నెలకొంటే పెద్ద ఎత్తున ప్రజలు భారత్ కు శరణార్ధులుగా తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి.