యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పూజా హెగ్డేలు హీరో హీరోయిన్స్ గా నటిస్తోన్న సినిమా రాధే శ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటలీలో కూడా మొదలయింది. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ పేరిట ఓ మోషన్ పోస్టర్ విడుదల చేసి ప్రభాస్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారు. రోమియో – జూలియట్, సలీం-అనార్కలి, దేవదాసు-పార్వతి జంటలను చూపిస్తూ విక్రమాదిత్య – ప్రేరణలని కూడా చూపారు.
అంటే అంత రేంజ్ లో వీరి ప్రేమ కూడా ఉందని చూపారు. ఇక ఈ మోషన్ పోస్టర్ లో సూపర్ స్టైలిష్ లుక్‌లో ప్రభాస్, గ్లామరస్ గా హీరోయిన్ కనిపిస్తున్నారు. రన్నింగ్ ట్రైన్ లో బయటకు వేలాడుతూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ ట్రీట్ ని మరింత స్పెషల్ గా చేసింది. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, కన్నడభాషల్లో విడుదల చేయనున్న ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు అనిపిస్తోంది. ఒక జన్మ ‘రాధే శ్యామ్’ గా ఉన్న హీరో, హీరోయిన్లు మరో జన్మలో ‘విక్రమదిత్యగా, ప్రేరణగా ఉంటారని అనిపిస్తోంది