ఆయుర్వేద మందుల లో ఎక్కువగా ఉపయోగించే కరక్కాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కరక్కాయ తీసుకోవడం వల్ల బుద్ధుని వికసింపజేస్తుంది. అంతే కాదు బలం కూడా కలుగుతుంది. కరక్కాయ ఆయుష్షును కూడా పెంచుతుంది. మల బద్ధకం, వాంతులు, ఫైల్స్, అసిడిటీ, గ్యాస్ సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తుంది. ఇలా ఒక్కటేమిటి రెండు ఏమిటి ఎన్నో సమస్యలు ఎంతో సులువుగా కరక్కాయ తొలగిస్తుంది. అయితే కరక్కాయ వల్ల కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి.
ఎక్కిళ్లు, ఉబ్బసం, దగ్గు, గుండె జబ్బులు కలిసి వచ్చినప్పుడు కొంచెం వేడి చేసిన పాత నెయ్యి లో కరక్కాయ పెచ్చులు చూర్ణం, ఇంగువ పొడి బిడలవణం చేర్చి అర టీ స్పూన్ చొప్పున రెండు పూటలా తీసుకోవాలి. దీనితో ఈ సమస్యలు మాయమైపోతాయి. చిన్న పిల్లలకి 1 నుంచి ఐదేళ్ల వరకు క్రమం తప్పకుండా దీన్ని ఇస్తే రోగనిరోధక శక్తి పెరిగి వృద్ధాప్యం లోనూ ఆరోగ్యంగా ఉంటారట. జలుబు జ్వరాలు తగ్గాలంటే కరక్కాయ పొడి తీసుకుంటే చిటికలో మాయమైపోతాయి.