ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తమ వినియోగదారులకు ఎన్నో రకాల స్కీంలను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాలసీలతో ఎన్నో ప్రయోజనాలు కస్టమర్లు పొందవచ్చు. అయితే ఎల్ఐసీలో ఉండే పాలసీలను బట్టి వాటి ప్రయోజనాలు పొందవచ్చని సంస్థ ప్రకటించింది. ఇప్పటికే చాలా రకాల స్కీంలకు వినిమోగదారులకు అందుబాటులో ఉంచింది. కస్టమర్లు స్కీంను ఎంచుకున్న దాని ప్రకారం ప్రయోజనం పొందవచ్చు.
ఎల్‌ఐసీ ప్రస్తుతం ఎన్నో రకాల పాలసీలను అందుబాటులో తెచ్చింది. అయితే వీటిల్లో ప్రత్యేకంగా మూడు పాలసీలు ముఖ్యమైనవి. ఆ పాలసీల గురించి ఈ క్రింది విధంగా తెలుసుకుందాం. ఈ మూడు పాలసీల్లో లైఫ్ లాంగ్ కవరేజ్‌తోపాటు మంచి రాబడి వస్తుందని అని చెప్పొచ్చు. మీరు మీ కుటుంబ భద్రతను, భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఈ మూడు పాలసీలు తీసుకోవచ్చని సంస్థ వెల్లడించింది.
మొదటిది ‘జీవన్ ఉమాంగ్ పాలసీ’. ఈ పాలసీ చాలా పాపులర్ అని చెప్పుకోవచ్చు. ఈ పాలసీ వల్ల వందేళ్ల వరకు కవరేజీ లభిస్తుంది. రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా పెన్షన్ పొందాలని భావించే వారు తప్పనిసరిగా ఈ పాలసీని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే నామినీగా ఉన్న వ్యక్తికి లేదా కుటుంబానికి బీమా మొత్తాన్ని చెల్లిస్తారు.
రెండవ పాలసీ ‘న్యూ జీవన్ ఆనంద్’. 18 ఏళ్లు నిండిన వాళ్లు ఈ పాలసీలో చేరవచ్చు. ఈ పాలసీలో కనీసం రూ.లక్ష బీమా మొత్తానికి పాలసీ తీసుకునే అవకాశముంది. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే నామినీకి బీమా మొత్తం చెల్లిస్తారు. ఒకవేళ పాలసీదారుడు జీవించి ఉంటే బీమా మొత్తంతోపాటు బోనస్ కూడా వస్తుందని ఎల్ఐసీ వెల్లడించింది.
మూడో పాలసీ ‘జీవన్ అమర్ పాలసీ’. ఈ పాలసీలో18- 65 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన వారు చేరవచ్చు. పాలసీదారుడు చనిపోయేంతవరకు ఈ పాలసీ కవరేజ్ లభిస్తుంది. 10-40 ఏళ్ల వరకు కాల పరిమితితో ఈ పాలసీ తీసుకోవచ్చని ఎల్ఐసీ తెలిపింది.