మార్కెట్ లో దొరికే అన్ని ప్రోడక్ట్స్ ట్రై చేసారా…? అయినా జుట్టు సమస్యలు వస్తున్నాయా..? అయితే ఈ చిట్కా చూడాల్సిందే. దీనితో సులువుగా జుట్టు సమస్యలకి చెక్ పెట్టేయొచ్చు. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి. హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ లో కెమికల్స్ ను ఉపయోగిస్తారు దీని వల్ల ఉపయోగాలు కంటే అనర్ధాలే ఎక్కువగా ఉన్నాయి. హెయిర్ ప్రాబ్లెమ్స్ నుంచి బయట పడడానికి ఈ కిచెన్ రెమెడీస్ చాలు.
నువ్వుల నూనె వల్ల జుట్టు పెరగడమే కాక తలనొప్పి, బట్టతల, జుట్టు నెరవడం అలాగే హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది. జుట్టు కూడా నల్లగా నిగనిగలాడేలా మారిపోతుంది. నిద్రలేమి సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. నువ్వుల నూనెను లీవ్ ఇన్ కండిషనర్ గా కూడా వాడవచ్చు. ఇది హెయిర్ షైన్ ను పెంచుతుంది. నూనెను స్కాల్ప్ పై మసాజ్ చేసుకుంటే ఎండ వలన తలెత్తే హెయిర్ డేమేజ్ సమస్య తగ్గుతుంది. చూసారా ఎంత సులువుగా జుట్టు సమస్యల నుండి బయట పడొచ్చు. మరి ఈ సమస్యల తో బాధ పడే వారు ఈ చిట్కాలని పాటించేయండి.