షవర్ జెల్ (shower gel ) గురించి పరిచయం చెయ్యక్కర్లేదు. చాలా సంవత్సరాల నుండి కూడా వీటిని ఎంతో మంది ఉపయోగిస్తున్నారు. సబ్బులకు బదులుగా షవర్ జెల్ ని చాలా మంది వాడుతున్నారు. ప్రతి రోజు సబ్బుకు బదులుగా దీనిని ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు. వీటిలో రకాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి.
టీ ట్రీ ఆయిల్, మల్లె, గులాబీ, అవకాడో, బొప్పాయి ఇలా వివిధ రకాల పదార్ధాలతో వీటిని తయారు చేస్తారు. శరీరాన్ని క్లీన్ చేయడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ రోజు షవర్ జెల్ వల్ల ఎటువంటి ఉపయోగాయాలు కలుగుతాయనేది చూసేద్దాం.
స్కిన్ మాయిశ్చరైజర్ ని పోకుండా చూస్తుంది:
సబ్బుతో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. దీని కారణంగా ఎలర్జీ, దురదలు వంటి సమస్యలు వస్తాయి. కానీ షవర్ జెల్ మాత్రం అలానే ఉంచుతుంది. కేవలం అధికంగా ఉండే మాయిశ్చరైజర్ ని మాత్రమే తొలగిస్తుంది.
శుభ్రంగా ఉండడానికి ఇది పర్ఫెక్ట్:
హైజీన్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. దీనిని ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.
డబ్బులు సేవ్ చేసుకోవచ్చు:
సబ్బును ఎక్కువగా ఉపయోగించడం వల్ల సబ్బు అరిగిపోతూ ఉంటుంది. కానీ షవర్ జెల్ వాడడం వల్ల మనకి కావాల్సిన అంత దాని నుండి తీసుకోవచ్చు. దీనివల్ల మనం వృధా చేయకుండా అవసరానికి తగ్గట్టు వాడుకోవచ్చు. దీంతో డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు.
మంచి నురగని ఇస్తుంది:
సబ్బు కంటే కూడా షవర్ జెల్ మంచి నురగ వస్తుంది. దీంతో కొద్దిగా మీరు షవర్ జెల్ తీసుకుని స్నానం చేస్తే మంచి నురగ వచ్చి శరీరం అంతా కూడా క్లీన్ గా ఉంటుంది.