ముల్తానీ మట్టిని జుట్టుకు అప్లై చేస్తే ఎన్ని లాభాలో..ఇలా చేసేయండి..!

-

ఈ రోజుల్లో జుట్టు రాలటం అనేది అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరికి కామన్‌గా ఉంటుంది. ఎక్కడ బట్టతల వస్తుందో అని అబ్బాయిలు భయపడుతున్నారు.. జట్టు అంతా ఊడిపోతే అందవికారంగా తయారవుతామని అమ్మాయిలు బాధ.. ఇలా ఆ జుట్టును కాపాడుకోవాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకా కర్ల్స్‌ ఉన్న హెయిర్‌ అయితే ఈ సీజన్‌లో బాగా పాడవుతుంది. వీటికి ముల్తానీ మట్టి బాగా ఉపయోగపడుతుంది. ఫేస్‌కే కాదు.. హెయిర్‌కు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా చేస్తుందట…ఇంకా ఈ ముల్తాని మట్టి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చూద్దామా..!
ముల్తానీ మిట్టితో ప్రయోజనాలు:
జుట్టు మీద ముల్తానీ మిట్టిని ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. చుండ్రు తొలగిపోతుంది, అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
ముల్తానీ మట్టి పొడి, చిక్కుబడ్డ జుట్టును అందంగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తుంది..
ఈ సీజన్‌లో జుట్టులో జిగురు ఎక్కువగా ఉంటుంది. ముల్తానీ మిట్టితో జుట్టును కడగడం వల్ల జుట్టు చిక్కు, జిగురు తొలగిపోతుంది.
జుట్టులోని మురికిని తొలగించడంలో ముల్తానీ మిట్టి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముల్తానీ మిట్టి జుట్టుకు కండీషనర్‌గా పనిచేస్తుంది.
ముల్తానీ మిట్టిని వారానికి రెండుసార్లు ఉపయోగించడం వల్ల జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
ఈ మట్టిలో అల్యూమినియం సిలికేట్ పుష్కలంగా ఉండటం వల్ల శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఎలా వాడాలి..?
టేబుల్ స్పూన్స్‌ ముల్తానీ మిట్టి 3 టేబుల్‌ స్పూన్స్‌ పెరుగు 1స్పూన్‌ నిమ్మరసం తీసుకోండి.
ముల్తానీ మట్టిని గిరజాల జుట్టు మీద ఉపయోగించాలంటే, ముల్తానీ మిట్టిని రాత్రి నీటిలో నానబెట్టండి. రాత్రంతా నానబెట్టడం వల్ల ఉబ్బుతుంది. ఒక చెంచాతో తిప్పి..అందులో 3 చెంచాల పెరుగు, 1 చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను బాగా మిక్స్ చేసి స్మూత్‌గా చేయండి. ఉండలు లేకుండా చూసుకోండి. పేస్ట్ చిక్కగా ఉంటే, మీరు పెరుగు లేదా నీటిని యాడ్‌ చేసుకోవచ్చు. తలకు అప్లై చేసి.. 20-25 నిముషాల పాటు ఉంచుకోండి. తర్వాత చల్లటి నీటితో జుట్టును కడగాలి. మీరు వారానికి ఒకటి లేదా రెండు సార్లు జుట్టుకు ముల్తానీ మిట్టిని ఉపయోగిస్తే మంచి ఫలితం చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version