దేశంలో అనేక మంది కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతుంటే… కొందరు మాత్రం అక్రమ మార్గాలు తొక్కుతున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో మరో వ్యభిచార ముఠా బయటపడింది. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని యశ్వంతపూర్ ఏరియాలో ఓ గెస్ట్ హౌస్ లో వ్యభిచారం జరుగుతుందని సమాచారంతో పోలీసులు ఆ గెస్ట్ హౌస్ పై నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ వ్యభిచారం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారితో పాటు అక్కడే ఉన్న ఐదు మంది యువతులను రక్షించిన పోలీసులు వారిని రెస్క్యూ హోంకు తరలించారు.
ఈ రైడ్ కు సంబంధించిన వివరాలను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సందీప్ పాటిల్ తెలిపారు. ఇదే నేపథ్యంలో పోయిన వారంలో కూడా సీసీబీ పోలీసులు ఓ వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారని తెలిపారు. అయితే ఆ సమయంలో ఏకంగా 27 మంది మహిళలను కాపాడి బెంగళూరు నగరంలోని రెస్క్యూహోంకు తరలించారు. ఒకవైపు బెంగళూరు నగరంలో కరోనా తీవ్రరూపం దాలుస్తుంది. మరోవైపు ఇలాంటి అసాంఘిక చర్యలు జరగడం ఎంతవరకు సమంజసమో అర్థం కావట్లేదు.