ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ భారత్‌లో అన్‌బాక్స్ మ్యాజిక్ 3.0, 2020 క్రిస్టల్ 4కె యూహెచ్‌డీ టీవీలను విడుదల చేసింది. క్రిస్టల్ రేంజ్ టీవీలు 43, 50, 55, 65, 75 ఇంచ్ డిస్‌ప్లే సైజుల్లో లభిస్తుండగా.. అన్‌బాక్స్ మ్యాజిక్ 3.0 టీవీలు 32, 43 ఇంచ్ డిస్‌ప్లే సైజుల్లో లభిస్తున్నాయి.
క్రిస్టల్ 4కె యూహెచ్‌డీ టీవీల్లో 4కె రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. క్రిస్టల్ 4కె ప్రాసెసర్ ఉంటుంది కనుక దృశ్యాలు పేరుకు తగినట్లే క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తాయి. శాంసంగ్‌కు చెందిన బిక్స్‌బీ వాయిస్ అసిస్టెంట్‌తోపాటు అమెజాన్ అలెక్సా అసిస్టెంట్‌ను వీటిలో అందిస్తున్నారు. వీటిని పర్సనల్ కంప్యూటర్‌గా కూడా వాడువకోచ్చు. యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, ఈరోస్ నౌ, సోనీ లివ్, వూట్ తదితర యాప్స్‌ను ఈ టీవీలలో ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు.
ఈ టీవీలను కొనుగోలు చేసేవారికి శాంసంగ్ ఉచితంగా ఆఫీస్ 365 సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. అలాగే 5జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ స్పేస్‌ను కూడా అందిస్తోంది.
ధరల వివరాలు…
* శాంసంగ్ అన్‌బాక్స్ మ్యాజిక్ 3.0 సిరీస్‌లో 32 ఇంచుల టీవీ ధర రూ.20,900గా ఉంది. 43 ఇంచుల టీవీ ధర రూ.41,900గా ఉంది.
* క్రిస్టల్ 4కె యూహెచ్‌డీ సిరీస్‌లో 43 ఇంచుల టీవీ ధర రూ.44,400 ఉండగా, 50 ఇంచుల టీవీ ధర రూ.60,900గా ఉంది. 55 ఇంచుల టీవీ ధర రూ.67,900, 65 ఇంచుల టీవీ ధర రూ.1,32,900, 75 ఇంచుల టీవీ ధర రూ.2,37,900 ఉంది.
ఈ టీవీలకు రెండు సంవత్సరాల వారంటీని అందిస్తున్నారు. మై శాంసంగ్ ఈఎంఐ ఆఫర్ కింద 32 ఇంచుల టీవీని నెలకు కేవలం రూ.990 ఈఎంఐకే కొనుగోలు చేయవచ్చు. 43 ఇంచుల టీవీకి నెలకు రూ.1190 ఈఎంఐ అవుతుంది. 49 ఇంచులు అంతకు మించిన సైజ్ ఉన్న టీవీలకు నెలకు ఈఎంఐ రూ.1990 అవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఫెడరల్ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డులతో టీవీలను కొంటే 10 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు.