కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి

-

భద్రాచలం మాజీఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత సున్నం రాజయ్య(59) కరోనాతో మృతి చెందారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు నిన్న కరోనా టెస్టులు చేయించగా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో కుటుంబ సభ్యులు రాజయ్యను భద్రాచలం నుండి విజయవాడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రాజయ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఆయన స్వగ్రామమయిన సున్నంవారిగూడెంలో అంత్యక్రియలు జరపనున్నట్లు సమాచారం.

గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న రాజయ్య ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. కరోనాగా అనుమానించి హోమ్‌ క్వారంటైన్‌కి పరిమితమై డాక్టర్ల సలహాలతో మందులు వాడుతున్నారని, ఎంతకు లక్షణాలు తగ్గకపోవడంతో కరోనా టెస్టు చేయించినట్లు దగ్గరి బందువులు తెలిపారు.

ప్రజల మనిషి, ప్రజల కోసం పోరాటాలు చేశారు. భద్రాచలం నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నిరాడంబరంగా ఉండేవారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రంపచోడవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version