సూళ్లలో ప్రత్యేక సబ్జెక్ట్ గా భగవద్గీత… సంచలన నిర్ణయం తీసుకున్న రాష్ట్రం

-

గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ప్రత్యేక సబ్జెక్ట్ గా భగద్గీతను తీసుకురానున్నారు. 2022-23 విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లలో ప్రత్యేక సబ్జెక్ట్ గా భగవద్గీతను తీసుకురానున్నట్లు  ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జితు వాఘని వెల్లడించారు. పాఠశాల విద్యలో భారతీయ సంస్కృతి మరియు విజ్ఞాన వ్యవస్థను చేర్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మొదటి దశలో మొదటి దశలో భగవద్గీతలో ఉన్న విలువలు, సూత్రాలను 6-12వ తరగతి నుండి పాఠశాలల్లో పిల్లల అవగాహన, ఆసక్తి కలిగే విధంగా ప్రవేశపెడుతామని ఆయన అన్నారు. ప్రార్థనా కార్యక్రమాల్లో కూడా భగవద్గీత శ్లోకాలు పఠించే విధంగా చర్యలు తీసుకోనుంది గుజరాత్ ప్రభుత్వం. 6,7,8 క్లాసులకు పుస్తకాల్లో కథ, పారాయణ రూపంలో.. 9 నుంచి 12 తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్ గా ప్రవేశపెడుతామని తెలిపింది గుజరాత్ ప్రభుత్వం. ప్రస్తుతం గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఇతర పార్టీలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి. ఇప్పటికే విద్యను కాషాయీకరించాలని బీజేపీ భావిస్తోందని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version