టెలికాం సంస్థలు ఓటీటీ సర్వీసుల విషయంలోనూ పోటీ పడుతున్నాయి. జియో, ఇప్పటికే దూసుకుపోతుండగా.. ఎయిర్‌టెల్ కూడా ఆ సర్వీసులను అందిస్తున్న విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు తన యూజర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది భారతీ ఎయిర్‌టెల్. అసలే ప్రతీ 28 రోజులకు రీఛార్జ్ కొందరికీ ఇబ్బందిగా మారిన నేపథ్యంలో దీర్ఘకాల వ్యాలిడిటిని ఇప్పటికే అందుబాటులో తెచ్చిన ఆ సంస్థ ఆ ప్లాన్ రీచార్జ్ చేసుకునే వారికి శుభవార్త చెప్పింది.
ఇప్పటివరకు ఉన్న రూ.2,999 నుంచి ప్లాన్ ను సైలెంట్‌గా అప్‌గ్రేడ్ చేసిన ఎయిర్‌టెల్.. ఈ ప్లాన్ కిందడేటా కాల్స్ ఎస్ఎంఎస్‌లతో పాటు ఇప్పుడు డిస్నీ + హాట్ స్టార్ సంవత్సర సబ్ స్క్రిప్షన్ ఉచితంగా ఆఫర్ చేస్తుంది. అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.3359 ప్లాన్ ప్రయోజనాలు కూడా ఇదేవిధంగా ఉన్నాయి. ఎయిర్‌టెల్ రూ.2999 ప్లాన్ విషయానికి వస్తే ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 356 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. రోజుకు 2 బీజీ డేటా ఈ ప్లాన్‌లో ఆఫర్ చేస్తుండగా.. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ సంవత్సరం పాటు డిస్నీ + హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా పొందవచ్చు. మ్యూజిక్ ఉచిత హలోట్యూన్ అకాడమీలో ఉచిత కోర్సులు, ఫాస్ట్ ట్యాగ్‌పై రూ.100 వరకు క్యాష్ బ్యాక్ లాంటి బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. నెలపాటు అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్ ఫ్రీ ట్రయల్‌ను కూడా వినియోగించుకోవచ్చు. అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.3359 ప్లాన్ కింద కూడా ఇవే ప్రయోజనాలుండటంతో ఈ ప్లాన్ ఎన్ని రోజులు ఉంటుందనే దానిపై మాత్రం క్లారిటీ లేదు.