భట్టి విక్రమార్క: తాజ్ కృష్ణ లో భట్టి.. విప్లవానికి నాంది పలికిన ఆయనే నాకు స్ఫూర్తి…!

-

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టెలి కమ్యూనికేషన్ విప్లవానికి నాంది పలికిన రచయిత శ్యామ్ పెట్రోడా తనకి స్ఫూర్తి అని చెప్పారు. హోటల్ తాజ్ కృష్ణలో రచయిత శ్యామ్ పిట్రోడా రచన చేసిన ప్రపంచానికే కొత్త రూపం ఇద్దాం కదలిరండి అనే బుక్ ని మాజీ కేంద్రమంత్రి పళ్లెం రాజు, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ తో పాటు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు.

ఆ తర్వాత భట్టి మాట్లాడుతూ ప్రముఖ రచయిత శ్యామ్ రచన చేసిన ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం రండి అనే బుక్ దేశం తో పాటు సమాజాన్ని మార్చి వేస్తుందని నమ్మకం ఉందని చెప్పారు. ఆర్థిక అసమానతలు పెరగడం వలన సమాజానికి మంచిది కాదని, ఇంక్లూజివ్ గ్రోత్ బయట ఉన్న ప్రజల్ని ఇంటిలిజవ్ గ్రోత్ లోకి తీసుకురావాలని ఈ పుస్తకం లో చెప్పారని చెప్పారు ఆయన సమాజ హితం కోసం చేస్తున్న రచనలు చాలా స్ఫూర్తిదాయకం చైతన్యమంతమైనవి అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version